News July 8, 2025

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

image

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News July 9, 2025

త్వరలో 704 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

TG: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇచ్చిన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ <<16856622>>పోస్టులకు<<>> అదనంగా మరో 704 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల్లో టీచింగ్ సమస్యలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అటు 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి కల్పించింది. 278 అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇవ్వనుంది.

News July 9, 2025

జిల్లా వరకే ఫ్రీ బస్సు.. మీరేమంటారు?

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నిన్న మరోసారి క్లారిటీ ఇచ్చారు. AUG 15 నుంచి ఈ స్కీమ్ ప్రారంభం అవుతుందని, ఇది కేవలం జిల్లాకే పరిమితమని స్పష్టం చేశారు. దీంతో ఒక జిల్లా మహిళలు మరో జిల్లాకు వెళ్లాలంటే సొంత జిల్లా సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లొచ్చు. జిల్లా దాటితే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అటు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించే సౌకర్యం ఉంది. మరి సీఎం నిర్ణయంపై మీ కామెంట్?

News July 9, 2025

నేడు భారత్ బంద్.. ఈ రంగాలపై ప్రభావం!

image

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్ ప్రభావం పరిశ్రమలు, పోస్టల్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ ప్రజా రవాణా, ప్రభుత్వరంగ సంస్థలపై ఉండనుంది. సహకార బ్యాంకులు పనిచేయకపోయినా ప్రైవేటు బ్యాంకులు పని చేయొచ్చు. విద్యాసంస్థలు, ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా నడిచే అవకాశం ఉంది. రవాణా విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.