News July 8, 2025

మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

image

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కిలో టమాటా రూ.37 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ అభిలాశ్ తెలిపారు. వారం రోజులుగా రూ. 34 నుంచి 37 వరకు పలికాయన్నారు. ఏకంగా 10 కిలోల మేలు రకం టమాటా బాక్స్ రూ.370, రెండో రకం రూ.350, మూడో రకం రూ.310 పలికినట్లు వెల్లడించారు. మొత్తం 1,055 క్వింటాళ్ల టమాటా మార్కెట్‌కు వచ్చిందన్నారు. రేట్లు ఇలాగనే ఉంటే రైతుల కలలు నెరవేరుతాయని చెప్పారు.

Similar News

News July 9, 2025

సిద్దుల గుట్టలో తలనీలాల వేలం రూ.2,35,500

image

బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దుల గుట్ట స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల వేలంపాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలం పాటలో రూ.2,35,500 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వంశీ తెలిపారు. ఈ వేలం పాటను కొడవటూరుకు చెందిన నిడిగొట్టు చిరంజీవి గతేడాది కంటే రూ.3,500 ఎక్కువగా పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.

News July 9, 2025

HYD: మహిళలు.. ఈ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.

News July 9, 2025

రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

image

AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.