News July 8, 2025
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో బీసీ బాలురు, బాలికల వసతి గృహ నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల ఆలస్యానికి గల కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8గదులను త్వరగా నిర్మిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ స్వయంగా గదులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, వేగంపై పలు సూచనలు చేశారు.
Similar News
News July 9, 2025
లార్డ్స్‌లో పరుగుల వరద కష్టమే?

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్‌లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, అట్కిన్‌సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.
News July 9, 2025
బీజేపీలోకి గాడిపల్లి భాస్కర్!

గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. గతంలో బీఆర్ఎస్, అనంతరం బీజేపీ, తరువాత కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న భాస్కర్, ఇప్పుడు మళ్లీ బీజేపీ గూటికి చేరుతున్నారు.
News July 9, 2025
KNR: భార్య దూషించందని భర్త సూసైడ్

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తిచెంది పురుగుమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన వీణవంక మండలం కోర్కల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నిమ్మల రాజు భార్య రజితతో కొంతకాలంగా అలుగునూరులో కూలీపని చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా రజిత రాజును తీవ్రంగా దూషించింది. మనస్తాపం చెందిన భర్త పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI తిరుపతి తెలిపారు.