News July 8, 2025
దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలే: RSS

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానంలో హిందీని తప్పనిసరి చేయాలన్న <<16168195>>వివాదం<<>> నేపథ్యంలో RSS కీలక ప్రకటన చేసింది. దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని స్పష్టం చేసింది. ఒకే భాషను RSS సమర్థించదని పేర్కొంది. కాగా ఈ విధానం ద్వారా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఇటీవల తమిళనాడు, మహారాష్ట్రలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలోనే RSS నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.
Similar News
News July 9, 2025
నేడు స్కూళ్లకు బంద్ ఉందా?

నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్‌కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.
News July 9, 2025
రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.
News July 9, 2025
హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.