News July 8, 2025
కళాశాలల వద్ద ఆకస్మిక తనిఖీలు – గుట్కా స్వాధీనం

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కాలేజీలు, స్కూల్స్ చుట్టూ “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీపీ ఆదేశాల మేరకు పలు పాన్ షాపులు, బడ్డీ కొట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతులు లేని గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News July 9, 2025
బాన్సువాడ: పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తి

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన గెంట్యల బసవయ్య(41) మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ముఖం బురదలో కూరుకపోయింది. దీంతో ఊపిరాడక బసవయ్య మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.
News July 9, 2025
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాలని, జుక్కల్‌లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ CHCను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి, ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.