News July 8, 2025
HYD: డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షురూ!

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈరోజు రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని శ్రీ వర్ధన్‌కి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నీక్స్ డాక్టర్ ఝాన్సీ రాణి ఉన్నారు.
Similar News
News July 9, 2025
HYD: మహిళలు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నం. 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.
News July 9, 2025
ప్రజల వద్దే సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి చట్టం అమలుపై MROలతో మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు, పూర్తి చేసిన ఆన్‌లైన్ ప్రక్రియ, జారీ చేసిన నోటీసులు, పరిష్కరించిన భూ సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజల వద్దే సమస్యలను పరిష్కరిస్తూ, నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
News July 9, 2025
సిద్దిపేట: రైతన్నలు జర భద్రం

వానాకాలంలో విద్యుత్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో మోటార్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు తక్కువగా ఉండటంతో బోర్లు, బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్కన్పేట మండలం పంతులుతండాకు చెందిన రైతు కిష్టునాయక్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.