News July 8, 2025
రేపల్లెలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రేపల్లెలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు నగరం మండలం దూళిపాళ్ల గ్రామం కొండవీటి మణిగ స్థానికులు గుర్తించారు. యువకుడు 17645 నంబరు రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సూపరింటెండెంట్, జీఆర్‌పీ ఆర్‌బీఎఫ్ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
నేడు క్యాబినెట్ భేటీ

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.
News July 9, 2025
ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్‌లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్‌పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
News July 9, 2025
VKB: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా

మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని అదనపు డీఆర్‌డీఏ నర్సింలు అన్నారు. తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులతో మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు అందిస్తున్న రుణాలు, ఇతర సదుపాయాలపై చర్చించారు. గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నర్సింలు అన్నారు. సంఘంలో లేని మహిళలను నూతన సంఘంలో చేర్పించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.