News July 8, 2025

తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.

Similar News

News July 9, 2025

ధవళేశ్వరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు పెయింటింగ్ పని చేసుకుని జీవించే పువ్వుల లక్ష్మణరావు (39) మంగళవారం రాజమండ్రి‌లో పని కోసం వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 9, 2025

తూ.గో జిల్లాలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్

image

రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

News July 8, 2025

ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

image

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్‌తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్‌లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.