News July 8, 2025
ధరూర్: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న జూరాల ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 14 గేట్లు ఓపెన్ చేసి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్‌కు 29,053, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400 క్యూసెక్కులు మొత్తం 1,26,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
బాన్సువాడ: పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తి

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన గెంట్యల బసవయ్య(41) మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ముఖం బురదలో కూరుకపోయింది. దీంతో ఊపిరాడక బసవయ్య మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.
News July 9, 2025
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాలని, జుక్కల్‌లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ CHCను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి, ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.