News July 8, 2025
పెద్దపల్లి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో మెడ నొప్పికి చికిత్స పొందినా తగ్గలేదని ఓ మహిళ, కడుపు నొప్పితో బాధపడుతూ మరో మహిళ PDPL ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు శ్రీధర్, స్రవంతి, సౌరయ్య తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం ఇద్దరికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. జిల్లా ప్రజలు DCH/PHCలను వినియోగించుకోవాలన్నారు.
Similar News
News July 9, 2025
ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..!

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారం రేపాయి. తెలుగు మహిళలు పలుచోట్ల ఆందోళనలు చేసి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ఉదయం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రసన్నపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనపై హత్యాయత్నం చేశారని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.
News July 9, 2025
ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.
News July 9, 2025
పటాన్‌చెరు: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు, MDK జిల్లా వాసి ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.