News July 8, 2025
ప్రణాళిక బద్ధంగా ఫీవర్ సర్వే చేపట్టాలి: జనగామ కలెక్టర్

జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇంటింటి ఫీవర్ సర్వేను చేపట్టాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఫీవర్ సర్వేను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి మాట్లాడారు. 100 రోజుల టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా టీబీ బారిన పడిన వారిని, అలాగే వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారు.. యాక్షన్ ప్లాన్ ఎలా చేశారు.. సరిపడా మెడిసన్‌లు ఉన్నాయా లేవా? అని ఆరా తీశారు.
Similar News
News July 9, 2025
ప్రజల వద్దే సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి చట్టం అమలుపై MROలతో మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు, పూర్తి చేసిన ఆన్‌లైన్ ప్రక్రియ, జారీ చేసిన నోటీసులు, పరిష్కరించిన భూ సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజల వద్దే సమస్యలను పరిష్కరిస్తూ, నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
News July 9, 2025
సిద్దిపేట: రైతన్నలు జర భద్రం

వానాకాలంలో విద్యుత్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో మోటార్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు తక్కువగా ఉండటంతో బోర్లు, బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్కన్పేట మండలం పంతులుతండాకు చెందిన రైతు కిష్టునాయక్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.
News July 9, 2025
నేడు క్యాబినెట్ భేటీ

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.