News July 8, 2025
జనగామ ఎమ్మెల్యేను కలిసిన ప్రభుత్వ విప్

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు ఇరు నియోజకవర్గాలకు సంబంధించి అంశాలపై నేతలు చర్చించారు. జనగామ ఎమ్మెల్యేను నేడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు పరామర్శించారు.
Similar News
News July 9, 2025
ప్రజలకు కామారెడ్డి ఎస్సీ సూచనలు

కామారెడ్డి జిల్లా ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. వర్షం కురిసినప్పుడు రోడ్లు తడిగా ఉండి వాహనాలు జారే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ తీగలు, స్తంభాలతో పాటు పాత ఇండ్లకు దూరంగా ఉండాలని SP విజ్ఞప్తి చేశారు.
News July 9, 2025
నేడు స్కూళ్లకు బంద్ ఉందా?

నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్‌కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.
News July 9, 2025
సిద్దుల గుట్టలో తలనీలాల వేలం రూ.2,35,500

బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దుల గుట్ట స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల వేలంపాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలం పాటలో రూ.2,35,500 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వంశీ తెలిపారు. ఈ వేలం పాటను కొడవటూరుకు చెందిన నిడిగొట్టు చిరంజీవి గతేడాది కంటే రూ.3,500 ఎక్కువగా పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.