News July 8, 2025
జనగామ: ‘సమ్మెను విజయవంతం చేయాలి’

రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులు అన్నారు. జనగామలోని రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో ఈరోజు ఆటో కార్మికులు సమావేశాలను నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. CITU జిల్లా కమిటీ మెంబర్ ప్రశాంత్, ఆటో యూనియన్ నేతలు మల్లేశ్, అశోక్, అలీ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
Similar News
News July 9, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 14మి.మీ, IDOC (కామారెడ్డి) 6.8, సర్వాపూర్, నసురుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి 5, రామలక్ష్మణ పల్లి 4.3, వెల్పుగొండ 3.5, ఇసాయిపేట 1.8, పాత రాజంపేట, కొల్లూరు 1.5, తాడ్వాయి 1.3, బిక్కనూర్ 1, లచ్చపేట, మేనూరు, దోమకొండలో 0.8మి.మీలుగా నమోదైంది.
News July 9, 2025
MHBD: స్థానిక ఎన్నికలు.. ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్!

ఈ నెలాఖరులో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంతో ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్ కలిసి రాకపోతే పరిస్థితి ఏంటని మహబూబాబాద్ జిల్లాలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలించకపోతే, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. మీ స్థానికంగా ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది?
News July 9, 2025
శ్రీశైలం జలాశయం చరిత్ర

శ్రీశైలం ప్రాజెక్టుకు 1963 జులైలో జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. డ్యాం నిర్మాణం 1984 డిసెంబరులో పూర్తయి, 1985 వర్షాకాలంలో నీటితో నిండింది. ప్రాజెక్టు చరిత్రలోనే 2009 అక్టోబర్ 2న అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం వరుసగా 770, 900 మె.వా.