News July 8, 2025

మహదేవపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్

image

మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఐ జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో గోడలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వాల్ కొటేషన్స్ ద్వారా మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటూ, సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్ఐ అన్నారు.

Similar News

News July 9, 2025

ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

image

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.

News July 9, 2025

పటాన్‌చెరు: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

image

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు, MDK జిల్లా వాసి ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.

News July 9, 2025

కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 14మి.మీ, IDOC (కామారెడ్డి) 6.8, సర్వాపూర్, నసురుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి 5, రామలక్ష్మణ పల్లి 4.3, వెల్పుగొండ 3.5, ఇసాయిపేట 1.8, పాత రాజంపేట, కొల్లూరు 1.5, తాడ్వాయి 1.3, బిక్కనూర్ 1, లచ్చపేట, మేనూరు, దోమకొండలో 0.8మి.మీలుగా నమోదైంది.