News July 8, 2025

మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే: మంత్రి

image

మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. గత BRS ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Similar News

News July 9, 2025

శ్రీశైలం జలాశయం చరిత్ర

image

శ్రీశైలం ప్రాజెక్టుకు 1963 జులైలో జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. డ్యాం నిర్మాణం 1984 డిసెంబరులో పూర్తయి, 1985 వర్షాకాలంలో నీటితో నిండింది. ప్రాజెక్టు చరిత్రలోనే 2009 అక్టోబర్ 2న అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం వరుసగా 770, 900 మె.వా.

News July 9, 2025

తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

image

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.

News July 9, 2025

మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.