News July 8, 2025
నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలకు తక్షణ మరమ్మతులు

నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, పైకప్పులు, ప్రహరీల మరమ్మతులకు తక్షణమే అంచనా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అత్యవసర పనులను మంజూరైన నిధులతో పూర్తి చేయాలన్నారు. శిథిల భవనాల కూల్చివేత కొనసాగించాలని సూచించారు. భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఉన్నారు.
Similar News
News July 9, 2025
HYD: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో ప్రవీణ్ కక్ష పెంచుకున్నాడు.. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.
News July 9, 2025
లార్డ్స్‌లో పరుగుల వరద కష్టమే?

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్‌లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, అట్కిన్‌సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.
News July 9, 2025
బీజేపీలోకి గాడిపల్లి భాస్కర్!

గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. గతంలో బీఆర్ఎస్, అనంతరం బీజేపీ, తరువాత కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న భాస్కర్, ఇప్పుడు మళ్లీ బీజేపీ గూటికి చేరుతున్నారు.