News July 8, 2025

వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మల్లిఖార్జున్

image

వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మల్లిఖార్జున్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఆయనకు గత ప్రిన్సిపల్ కిరణ్మయి పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. స్వాగతం పలికిన వారిలో మెడికల్ కళాశాల ఏఓ రఘు తదితరులున్నారు.

Similar News

News July 9, 2025

ప్రజల వద్దే సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

భూ భారతి చట్టం అమలుపై MROలతో మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు, పూర్తి చేసిన ఆన్‌లైన్ ప్రక్రియ, జారీ చేసిన నోటీసులు, పరిష్కరించిన భూ సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజల వద్దే సమస్యలను పరిష్కరిస్తూ, నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

News July 9, 2025

సిద్దిపేట: రైతన్నలు జర భద్రం

image

వానాకాలంలో విద్యుత్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో మోటార్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు తక్కువగా ఉండటంతో బోర్లు, బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్కన్పేట మండలం పంతులుతండాకు చెందిన రైతు కిష్టునాయక్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.

News July 9, 2025

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.