News July 8, 2025
ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
KNR: భార్య దూషించందని భర్త సూసైడ్

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తిచెంది పురుగుమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన వీణవంక మండలం కోర్కల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నిమ్మల రాజు భార్య రజితతో కొంతకాలంగా అలుగునూరులో కూలీపని చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా రజిత రాజును తీవ్రంగా దూషించింది. మనస్తాపం చెందిన భర్త పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI తిరుపతి తెలిపారు.
News July 9, 2025
నిరుద్యోగ యువతీయువకులకు సువర్ణవకాశం

శంకరపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద నిరుద్యోగ యువతీయువకులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో శిక్షణ అందించి ఉద్యోగం కల్పించనున్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో ఈ నెల 10న కార్యాలయంలో సంప్రదించాలని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.
News July 9, 2025
చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌కు బంగారు పతకం

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ప్రతిభ కనబరిచారు. మెడికల్ లీగల్ టెస్ట్‌లో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్‌ను సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీమ్ రావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ అభినందించారు.