News July 8, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి రామాలయ ఈవో పై దాడి
✓దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ప్రచారం
✓త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ
✓జిల్లా వ్యాప్తంగా సీత్లా పండుగ వేడుకలు
✓కూలిన భద్రాచలం కరకట్టను నిర్మించాలి: సీపీఎం
✓డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన అశ్వాపురం ఎస్ఐ
✓చండ్రుగొండ పంట పొలాల్లో సాంబార్ జింక మృతి
✓టేకులపల్లిలో మునగ తోటను పరిశీలించిన కలెక్టర్
✓ మాజీ సీఎం వైయస్సార్ జయంతి వేడుకలు

Similar News

News July 9, 2025

సిద్దిపేట: రైతన్నలు జర భద్రం

image

వానాకాలంలో విద్యుత్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో మోటార్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు తక్కువగా ఉండటంతో బోర్లు, బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్కన్పేట మండలం పంతులుతండాకు చెందిన రైతు కిష్టునాయక్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.

News July 9, 2025

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.

News July 9, 2025

ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

image

ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్‌లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్‌పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.