News July 9, 2025
బెట్టిగ్‌కి దూరంగా ఉండాలి: ఎస్పీ

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంపై ఖర్చు చేయొద్దన్నారు. జిల్లాలో ఎవరైన ఆన్‌లైన్ గేమ్స్, డ్రగ్స్, బెట్టింగ్స్‌కు పాల్పడినా లేదా నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై 83338 13228కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News July 9, 2025
HYD: మహిళలు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.
News July 9, 2025
రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.
News July 9, 2025
అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వలు ఎవరు కలిగి ఉన్నా ఉపేక్షించేది లేదని, ఆయా షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా మంగళవారం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు100 గజాల దూరంలో ఉన్న షాపులలో పొగాకు, గుట్కా నిల్వల పై సోదాలు చేసి కేసులు పెట్టమన్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.