News July 9, 2025
అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.
Similar News
News July 9, 2025
తిరుపతి వేదికగా జాతీయ మహిళా సదస్సు: స్పీకర్ అయ్యన్న

APలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పాల్గొనే ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. అటు ఆగస్టు మొదటి లేదా రెండోవారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో స్పీకర్ మాట్లాడారు.
News July 9, 2025
రేపు ‘బాహుబలి’ రీరిలీజ్ తేదీ ప్రకటన?

ప్రభాస్& రానా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకేసారి రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ అయ్యే ఈ చిత్ర తేదీని ప్రత్యేక పోస్టర్ ద్వారా రేపు ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ రిలీజై రేపటికి 10 ఏళ్లు పూర్తికానుంది. కాగా, ‘బాహుబలి వస్తున్నాడు’ అని తాజాగా మేకర్స్ ట్వీట్ చేయడంతో దీనిపై ఆసక్తి పెరిగింది.
News July 9, 2025
ఆమెకు ఐఫోన్, రూ.లక్షల్లో డబ్బు ఇచ్చా: యశ్

తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని RCB బౌలర్ <<16985182>>యశ్ దయాల్ <<>>తెలిపారు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్‌కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.