News July 9, 2025
అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధం

అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధించారు. గిరి ప్రదక్షిణలో అప్పుఘర్ బీచ్ చాలా కీలకం. ఇక్కడే స్నానమాచరించి తిరిగి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఒకేసారి వేలల్లో జనం ఇక్కడకు చేరుకుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగా స్నానాలు నిషేధించారు. ఇక్కడ తీరంలో స్నానాలు చేయడానికి నీటిని, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ కూడా ఇసుకలోనే ఏర్పాటు చేశారు.
Similar News
News July 9, 2025
నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు
News July 9, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే సామాజిక సేవ

ఫూటుగా మద్యం తాగి బండ్లు నడుపుతూ పట్టుబడిన వారు సామాజిక సేవచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌లో చిక్కిన ముగ్గురికి మేడ్చల్ అత్వెల్లి కోర్టులో 2రోజులు, సుచిత్ర కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్, అవేర్నెస్, రోడ్లు మరమ్మతులులో పాల్గొనాలని ఆదేశించిందని తెలిపారు. శిక్ష అమలులో భాగంగా నిందితులు సుచిత్ర కూడలిలో పనులు చేశారు.
News July 9, 2025
పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సారించండి: కలెక్టర్

వివిధ ప్రాజెక్టుల భూసేకరణపై బుధవారం కలెక్టర్ మహేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్, జాతీయ రహదారి 216, బైపాస్ రోడ్డు పురోగతి, నష్టపరిహారాల చెల్లింపుపై చర్చించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ నిశాంతి, ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.