News July 9, 2025

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కీలక ఆదేశాలు..

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాలని, జుక్కల్‌లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ CHCను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి, ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

Similar News

News July 9, 2025

నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

image

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు

News July 9, 2025

HYD: కళ్లద్దాలు వచ్చాయా? ఆధార్ అప్డేట్ చేయండి!

image

గతంలో సైట్ లేక, ఇటివలే కంటికి సైట్ వచ్చి, కళ్లద్దాలు పెట్టుకున్న వారి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. HYDలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సహా పలు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ సమస్య ఏర్పడుతోంది. దీంతో బయోమెట్రిక్ అప్డేషన్ కోసం సెంటర్ల వద్ద విద్యార్థులు క్యూ లైన్లు కడుతున్నారు. ఐరిస్ మార్పుల కారణంగా ఇలా అయి ఉండొచ్చని, అప్పుడప్పుడు అప్డేషన్ అవసరమన్నారు.

News July 9, 2025

భద్రాచలం ఈవోపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల

image

భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం వాసులు భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈవోను ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.