News July 9, 2025
బాన్సువాడ: పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తి

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన గెంట్యల బసవయ్య(41) మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ముఖం బురదలో కూరుకపోయింది. దీంతో ఊపిరాడక బసవయ్య మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
Similar News
News July 9, 2025
తిరుపతి వేదికగా జాతీయ మహిళా సదస్సు: స్పీకర్ అయ్యన్న

APలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పాల్గొనే ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. అటు ఆగస్టు మొదటి లేదా రెండోవారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో స్పీకర్ మాట్లాడారు.
News July 9, 2025
నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు
News July 9, 2025
HYD: కళ్లద్దాలు వచ్చాయా? ఆధార్ అప్డేట్ చేయండి!

గతంలో సైట్ లేక, ఇటివలే కంటికి సైట్ వచ్చి, కళ్లద్దాలు పెట్టుకున్న వారి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. HYDలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సహా పలు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ సమస్య ఏర్పడుతోంది. దీంతో బయోమెట్రిక్ అప్డేషన్ కోసం సెంటర్ల వద్ద విద్యార్థులు క్యూ లైన్లు కడుతున్నారు. ఐరిస్ మార్పుల కారణంగా ఇలా అయి ఉండొచ్చని, అప్పుడప్పుడు అప్డేషన్ అవసరమన్నారు.