News July 9, 2025
ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News October 28, 2025
ఆదిలాబాద్: పోగొట్టుకున్న బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన పోలీసులు

గ్రామానికి వెళ్లే క్రమంలో సునీత అనే మహిళ బంగారు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయింది. ఈ విషయంపై వెంటనే ఆదిలాబాద్ బస్టాండ్‌లోని పోలీస్ సబ్ కంట్రోల్‌లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఏఆర్ ఎస్ఐ ఎల్.దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ కలిసి బాధితురాలు సునీత, పిల్లలు తెలిపిన ఆధారాల ప్రకారం ఆటో కోసం వెతకారు. ఆటోడ్రైవర్ జావిద్ నిజాయతీ చాటుకుని తిరిగి తన బ్యాగ్‌ను బాధితురాలికి అందించారు.
News October 28, 2025
ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

ANM, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 28, 2025
నిర్లక్ష్యం చేస్తే చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

2023-24 సీజన్‌కు సంబంధించిన మిగిలిన నాన్ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యాన్ని తక్షణం సరఫరా చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డిసెంబర్ చివరి నాటికి వందశాతం సరఫరా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి వారం మిల్లర్లు తమ సరఫరా పురోగతిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, నివేదికలు సమర్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.


