News July 9, 2025
Y.S జగన్‌కు మరో పదవి

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News January 26, 2026
ఉత్తమ జీఎస్టీ అధికారిగా జ్ఞానానంద రెడ్డి

ప్రొద్దుటూరు స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (CTO) జ్ఞానానంద రెడ్డి సోమవారం కడపలో కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. పన్నుల ఆడిట్, వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆయనను అభినందిస్తూ ప్రశంసా పత్రం ఇచ్చారు. పులివెందుల కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న జ్ఞానానంద రెడ్డిని ప్రొద్దుటూరు, పులివెందుల కార్యాలయాల అధికారులు అభినందించారు.
News January 26, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.16,550
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,226
* వెండి 10 గ్రాముల ధర: రూ.3,560.
News January 26, 2026
కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.


