News July 9, 2025
నేడు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ PPT

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PPT) ఇవ్వనుంది. ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇటీవల పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై PPT ఇవ్వగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నారు. BRS హయాంలో కృష్ణా జలాల లెక్కలను మంత్రి వివరించనున్నారు.
Similar News
News July 9, 2025
ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
News July 9, 2025
మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.