News July 9, 2025

రేపు మరో 9.51 లక్షల మందికి ‘తల్లికి వందనం’

image

AP: రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.

Similar News

News July 9, 2025

ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

News July 9, 2025

మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

image

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.