News July 9, 2025

GNT: తురకపాలెం రోడ్డులో వ్యక్తి దారుణ హత్య

image

నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డులో కరిముల్లా హత్యకు గురయ్యాడు. స్తంభాలగరువుకు చెందిన నివాసిగా పోలీసులు నిర్థారించారు. కరిముల్లా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు రెండ్రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు మధురెడ్డి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 30, 2025

గుంటూరు జిల్లా బార్లకు వేలంపాట

image

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బార్లకు వేలంపాట నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 బార్లకు దరఖాస్తులు అందాయని, 10 కల్లుగీత కార్మికులకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. వేలంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.

News August 30, 2025

గుంటూరు: MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ రిలీజ్‌

image

ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరి. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, బ్యాంకింగ్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం, బిజినెస్‌ ఎనాలిటిక్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ వంటి 8 స్పెషలైజేషన్‌లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్‌ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.

News August 30, 2025

గుంటూరు యువకుడికి బంగారు పతకాలు

image

కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. జూనియర్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముఖేష్, 3 టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఒక వ్యక్తిగత కాంస్య పతకం సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుగైన స్థానాన్ని పొందింది.