News July 9, 2025
కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!
Similar News
News September 7, 2025
మచిలీపట్నం: పర్యాటకుల జేబుకు చిల్లు..!

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతున్నారు. ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌పై కూడా ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News September 7, 2025
మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 6, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్లు ఎంపిక
☞ ఆత్కూరులో యువతతో ముచ్చటించిన వెంకయ్య నాయుడు
☞ రైతుల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయండి: కలెక్టర్
☞ జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ కృష్ణా: తగ్గుముఖం పట్టిన వరద
☞ చల్లపల్లి: నదిలో మునిగి యువకుడి మృతి