News July 9, 2025

ఖమ్మం జిల్లా లక్ష్యం 35,23,300 లక్షలు

image

వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం అటవీ శాఖ తరఫున 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 3,08,920, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.

Similar News

News August 31, 2025

అన్నదాతను ముంచిన వర్షం

image

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 3,644 ఎకరాల మేర పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 33% పైగా 2,893 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని గుర్తించారు. వరి 1,950 ఎకరాలు, పత్తి 330, పెసర 613 ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు. అత్యధికంగా కూసుమంచి మండలంలో 1,875 ఎకరాల్లో వరి, 320 పత్తి, పెసర 160 ఎకరాల పంటను రైతులు నష్టపోయారు.

News August 31, 2025

ఖమ్మం: ‘3 నుంచి PACS ద్వారా యూరియా పంపిణీ’

image

పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియా పంపిణీ PACS కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారానే జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సెప్టెంబర్ 3 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 2500 ఎకరాలకు ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 30, 2025

నూతన కార్డు దారులకూ రేషన్ బియ్యం: DSM శ్రీలత

image

ఖమ్మం జిల్లాలో నూతన కార్డుదారులకు కూడా సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం అందించనున్నట్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జీ.శ్రీలత తెలిపారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల లెవల్ స్టాక్ పాయింట్‌ను శనివారం ఆమె ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లోని బియ్యం నిల్వలను పరిశీలించి, బియ్యం దుకాణాలకు సరఫరా విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.