News July 9, 2025

కొత్తపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గోండుగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి అను ఉరివేసుకొని మంగళవారం మృతి చెందింది. మోతుగూడెం ఎస్సై కథనం మేరకు.. కొత్తపల్లి పంచాయతీ గొందిగూడెం గ్రామానికి చెందిన MLT విద్యార్థిని రోజు మాదిరిగానే రంపచోడవరం కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం వారి పొలానికి వెళ్లి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News July 9, 2025

పీయూ న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు

image

పాలమూరు యూనివర్సిటీలో ఉన్న న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. మూడేళ్లు ఎల్ఎల్బీ కోర్సులో 2025-26 విద్యా సంవత్సరంలో రెండు సెక్షన్‌లలో కలిపి 60 మంది విద్యార్థుల చొప్పున తీసుకోవచ్చునని అనుమతి ఇస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేశ్ బాబు తెలిపారు.

News July 9, 2025

సిరిసిల్ల: కస్తుర్భా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

image

బోయినపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కిచెన్, స్టోర్ రూమ్, మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.

News July 9, 2025

పెద్దపల్లి: సమ్మె చేస్తుండగా కార్మికుడి మృతి

image

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం జరిగిన కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కార్మికులు ర్యాలీ చేపట్టిన అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో దొంగతుర్తికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు ఆకుల రాజయ్యకు గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు CPR చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.