News July 9, 2025
జాతీయ అవార్డుకు ధర్మవరం డిజైనర్ ఎంపిక

ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ నాగరాజు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషన్ ప్రకటించిన డిజైన్ డెవలప్మెంట్ మార్కెటింగ్ అవార్డులకు గాను తనను ఎంపిక చేశారని నాగరాజు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
వేములవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో మాక్ డ్రిల్

అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత పెంచేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను ఎలా సురక్షితంగా తరలించాలి, ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ను ఎలా ఉపయోగించాలని ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
పీయూ న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు

పాలమూరు యూనివర్సిటీలో ఉన్న న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. మూడేళ్లు ఎల్ఎల్బీ కోర్సులో 2025-26 విద్యా సంవత్సరంలో రెండు సెక్షన్‌లలో కలిపి 60 మంది విద్యార్థుల చొప్పున తీసుకోవచ్చునని అనుమతి ఇస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేశ్ బాబు తెలిపారు.