News July 9, 2025

NLG: మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

image

నలుపు, కొండ అనే రెండు పదాల కలయిక వలన ‘నల్లకొండ’ ఏర్పడింది. నల్గొండలో నలుపు రంగు గల కొండ ఉండటం వలన ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. గతంలో నల్గొండను నీలగిరి అని పిలిచేవారు. బహమనీ సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని అల్లావుద్దీన్ బహమన్ షా స్వాధీనం చేసుకున్న తర్వాత పేరు నల్లగొండగా మారింది. నిజాంల పాలనలో ఈ పేరు అధికారికంగా నల్గొండగా స్థిరపడింది. మరీ మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చిందో కామెంట్ చేయండి.

Similar News

News July 9, 2025

పెద్దపల్లి: సమ్మె చేస్తుండగా కార్మికుడి మృతి

image

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం జరిగిన కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కార్మికులు ర్యాలీ చేపట్టిన అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో దొంగతుర్తికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు ఆకుల రాజయ్యకు గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు CPR చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 9, 2025

సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

image

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.