News March 30, 2024
YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్‌కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <