News July 9, 2025

HYD: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

image

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో ప్రవీణ్ కక్ష పెంచుకున్నాడు.. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.

Similar News

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 9, 2025

సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

image

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

News July 9, 2025

ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయండి: పెద్దపల్లి కలెక్టర్

image

జులై 7 నుంచి 18 వరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు జరగనున్నాయి. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యం, అక్షరాస్యత, బీమా, జీవనోపాధులపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో సభ్యత్వం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళలు చురుకుగా పాల్గొని ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.