News March 30, 2024
NZB: SRSP వద్ద విదేశీ పక్షుల సందడి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది. ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.
Similar News
News April 22, 2025
ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
నిజామాబాద్: 59.25 శాతం ఉత్తీర్ణత: DIEO

ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో 59.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. వార్షిక పరీక్షల్లో జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు.
News April 22, 2025
NZB: జిల్లా నూతన జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన G.V.N. భరతలక్ష్మిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వుల మొక్కను అందజేశారు. ఇరువురు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను నూతన జడ్జీకి సీపీ వివరించారు.