News July 9, 2025

23న సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

image

సిద్దిపేట జిల్లా కోహెడలో ఈ నెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి మంగళవారం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ సామాగ్రి (స్టీల్ బ్యాంకు) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News July 9, 2025

పెద్దపల్లి: సమ్మె చేస్తుండగా కార్మికుడి మృతి

image

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం జరిగిన కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కార్మికులు ర్యాలీ చేపట్టిన అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో దొంగతుర్తికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు ఆకుల రాజయ్యకు గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు CPR చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 9, 2025

సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

image

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.