News July 9, 2025
సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మంత్రి సీతక్కకు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నాకు అత్యంత ఆత్మీయురాలు, సోదరి, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
Similar News
News July 9, 2025
సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
News July 9, 2025
ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయండి: పెద్దపల్లి కలెక్టర్

జులై 7 నుంచి 18 వరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు జరగనున్నాయి. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యం, అక్షరాస్యత, బీమా, జీవనోపాధులపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో సభ్యత్వం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళలు చురుకుగా పాల్గొని ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
News July 9, 2025
HYD: BC బోనం పోస్టర్ ఆవిష్కరించిన చిరంజీవులు

42% బీసీ రిజర్వేషన్‌ను నోటిఫికేషన్‌తో వెంటనే అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం, సుప్రీంకోర్టు 50% పరిమితి నిబంధనకు విరుద్ధమని BC ఇంటలెక్చువల్స్ ఫోరం ఛైర్మన్ (Retd IAS) చిరంజీవులు అన్నారు. OUలో BC బోనం పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా కులగణన తర్వాత రిజర్వేషన్‌ను 68% పెంచితే పాట్నా హై కోర్టు కొట్టేసిన అనుభవం మన ముందుందని గుర్తు చేశారు.