News July 9, 2025

గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

image

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.

Similar News

News August 31, 2025

డేవిడ్ వార్నర్ న్యూ లుక్

image

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. షార్ట్ హెయిర్‌తో ఉండే వార్నర్ ఇలా లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చారు. ‘కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వస్తోంది’ అంటూ ఓ ఫొటోని ఇన్‌స్టా స్టోరీగా పెట్టారు. పొడవైన జుట్టుతో కనిపించగానే.. వార్నర్ మళ్లీ ఏదైనా మూవీలో నటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.

News August 31, 2025

కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

image

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News August 31, 2025

పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: CM

image

KC వేణుగోపాల్ ప్రారంభించిన MP మెరిట్ అవార్డులకు దేశంలో ఎంతో ప్రత్యేకత ఉందని CM రేవంత్ పేర్కొన్నారు. కేరళలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘కేరళలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. TGలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.