News July 9, 2025
HCA 2డే లీగ్.. పాలమూరు ఘన విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి B-డివిజన్ టుడే లీగ్ ఛాంపియన్షిప్‌లో ఉమ్మడి MBNR జట్టు రాకేశ్-XI జట్టుపై 148 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన MBNR జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాకేశ్-XI జట్టు 45.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో MDCA ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు.
Similar News
News July 10, 2025
MNCL: సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి

మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో బాలికలకు భద్రత, భరోసాతో కూడిన నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ యాదయ్య సూచించారు.
News July 10, 2025
400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
News July 10, 2025
మంచిర్యాల జిల్లా అధికారులతో DPO సమావేశం

జిల్లా పంచాయతీ అధికారి D.వెంకటేశ్వరరావు అధ్యక్షతన డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్లాంటేషన్, గ్రామపంచాయతీల తనిఖీలు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, DSR గురించి సమీక్షించారు.