News July 9, 2025

‘శబరి’ రైలు ఇక సూపర్‌‌ఫాస్ట్

image

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

Similar News

News August 31, 2025

జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

image

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.

News August 31, 2025

జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.

News August 31, 2025

రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.