News March 30, 2024

మక్కువలో నవవధువు మృతి

image

మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నవవధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.

Similar News

News April 19, 2025

బొత్స వ్యూహాలు ఫలించేనా

image

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?

News April 18, 2025

బొబ్బిలిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

image

బొబ్బిలిలోని శ్రీవెంకటకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న షాపింగ్ కంప్లెక్స్‌‌లో విద్యార్థి JAC ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. వేసవి సెలవులలో విద్యార్థులకు JAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బి.సాయి కిరణ్ చెప్పారు. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, DTP, C, C ప్లస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.

News April 18, 2025

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

image

రైలు నుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతిచెందాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..అన్నవరం-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అప్పారావు(55) మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా మృతుడు ఎల్.కోట మండలం వీరభద్రపేటకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

error: Content is protected !!