News July 9, 2025

ADB: ఆగస్టు 3న టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ పరీక్ష

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) రాత పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. మే, జూన్ 2025లో నిర్వహించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్స్‌లో ఫెయిలైన విద్యార్థుల కోసం హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఆగస్టు 3న పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News July 9, 2025

ADBలో పర్యటించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి బాయి బుధవారం ADB జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను, సఖీ కేంద్రం, బాలరక్షక్ భవన్, శిశుగృహను ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సఖి కేంద్రంలో మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ఉన్నారు.

News July 9, 2025

ADB: ‘సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు’

image

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోరమండల్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నానో ఎరువులు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాక, పంట దిగుబడుల పెంచుతాయని చెప్పారు. రైతులు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.

News July 9, 2025

ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

image

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.