News March 30, 2024
LSGలోకి న్యూజిలాండ్ ప్లేయర్

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో(LSG) జట్టు ప్లేయర్‌ను మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్న డేవిడ్ విల్లీ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్‌ను తీసుకుంది. రూ.1.25 కోట్ల బేస్ ప్రైజ్‌తో NZ బౌలర్ హెన్రీ లక్నో జట్టుతో చేరారు. గతంలో పంజాబ్ కింగ్స్, CSK జట్లలో భాగమైన హెన్రీ.. పంజాబ్ తరఫున మాత్రమే 2 మ్యాచ్‌లు ఆడారు.
Similar News
News January 18, 2026
జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్‌గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.
News January 18, 2026
మెస్రం వంశీయుల ఆచారాలు

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.