News July 9, 2025

మాతృభూమికి సేవ చేయడం అభినందనీయం: కలెక్టర్

image

జన్మభూమికి సేవ చేయాలనే సంకల్పంతో పలు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మూడేళ్లుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. యూఎస్ఏకు చెందిన చిక్కాల విద్యాసాగర్ ముందున్నారని కలెక్టర్ ప్రశంసించారు.

Similar News

News July 10, 2025

భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మోత్కూర్ జామచెట్లబావి ఎక్స్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుండాల మండలం వంగాలకి చెందిన చిప్పలపల్లి శంకర్ (48) టీవీఎస్‌పై మోత్కూర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఓ మైనర్ బాలుడు బైక్‌పై అతి వేగంగా వచ్చి శంకర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

News July 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 10, 2025

‘X’ CEO పదవికి లిండా రాజీనామా

image

ప్రముఖ SM యాప్ ‘X’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘రెండు అద్భుతమైన సంవత్సరాల తర్వాత నేను CEO హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కమ్యూనిటీ నోట్స్ ఆవిష్కరణల నుంచి, త్వరలో ప్రారంభంకానున్న X మనీ వరకు ఈ బృందం కృషి ఎంతో గొప్పది’ అని ట్వీట్ చేశారు. లిండా రాజీనామాపై ఎలాన్ మస్క్ ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ స్పందించారు.