News March 30, 2024
పవన్ ‘వారాహి సభ’కు అనుమతి నిరాకరణ
AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం పోలీసులు షాక్ ఇచ్చారు. ‘వారాహి’ సభకు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడొద్దని సూచించారు. నిర్ణీత సమయంలో వాహనం కోసం దరఖాస్తు చేసుకోనందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. చిన్నపాటి వాహనానికి అనుమతించారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 7, 2024
మూసీ వరదపై మళ్లీ అధ్యయనం
TG: మూసీ నది గరిష్ఠ వరదపై ఐఐటీ హైదరాబాద్ సహకారంతో మళ్లీ అధ్యయనం చేపట్టనున్నారు. ఇటీవల హైడ్రాలజీ విభాగం మూసీ గరిష్ఠ వరద 1.5 లక్షల క్యూసెక్కులే అని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారంతో పున:పరిశీలన చేయించిన తర్వాత నిర్ధారణకు రావాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మూసీ నది సరిహద్దులు ఖరారు చేయాలని నిర్ణయించింది.
News November 7, 2024
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది. ఈ కిట్‌లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120, 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది.
News November 7, 2024
11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ
AP: విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 1న అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై 5వ తేదీతో ముగుస్తుంది. DEC 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21-26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు నిర్వహిస్తారు. దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.