News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
చింతపల్లి ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం

నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తిపై హైకోర్టు ఆగ్రహం చేసింది. టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి దంపతులకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారాన్ని బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నించారని శిల్పా చక్రవర్తి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్‌పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.
News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.