News March 30, 2024

కేజ్రీవాల్ భార్యను కలిసిన సోరెన్ సతీమణి

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను ఝార్ఖండ్ మాజీ CM హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో సునీతకు తన సానుభూతిని తెలిపారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించిన కల్పన.. సునీత బాధను తాను అర్థం చేసుకోగలనంటూ మద్దతుగా నిలిచారు.

Similar News

News December 29, 2024

హైదరాబాద్‌లో మన్మోహన్ విగ్రహం?

image

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

News December 29, 2024

విరాట్‌తో నితీశ్ కుటుంబం ఫొటో

image

నితీశ్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నిన్న సెంచరీతో చెలరేగిన అతడికి విరాట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. నితీశ్ కుటుంబంతో కలిసి ఫొటో దిగారు. అభిమానించే స్థాయి నుంచి ఆ అభిమాన ఆటగాడి చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకుని, బ్యాటింగ్‌లో చెలరేగుతున్న నితీశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మున్ముందు నితీశ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత పైన ఆడించాలని రవిశాస్త్రి సూచించారు.

News December 29, 2024

AUSvsIND: భారత్ ఆలౌట్

image

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.