News July 9, 2025
KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.
Similar News
News July 10, 2025
సిద్దిపేట: పరుగుతోనే జీవితం మెరుగు: TUWJ

పరుగుతోనే జీవితం మెరుగవుతుందని టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించే మూడో ఎడిషన్ హాఫ్ మారథాన్ రన్ గోడపత్రికను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌లతో కలిసి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. హాఫ్ మారతాన్ రన్‌కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
News July 10, 2025
చింతపల్లి ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం

నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తిపై హైకోర్టు ఆగ్రహం చేసింది. టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి దంపతులకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారాన్ని బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నించారని శిల్పా చక్రవర్తి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్‌పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.